Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Galgotias: మళ్లీ దొరికిపోయిన గల్గోటియాస్-ఏఐ సదస్సు నవ్వులపాలు..!

ఢిల్లీలో దేశాధినేతలు హాజరైన ఏఐ ఇంప్లాక్ట్ సదస్సులో నాసిరకం వస్తువుల ప్రదర్శనతో మొత్తం సదస్సు నవ్వులపాలవుతోంది.

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు (AI Impact Summit 2026)కు ఏదీ కలిసి రావడం లేదు. తొలిసారి అంతర్జాతీయ స్ధాయిలో ఏఐ సదస్సు పెట్టి, దానికి సుందర్ పిచాయ్ తో పాటు పలు టెక్ దిగ్గజ సంస్థల అధిపతుల్ని ఆహ్వానించినా, స్వయంగాప్రధాని మోడీ వెళ్లి ప్రారంభోత్సవాలు చేసినా.. తొలిరోజే ప్రమోషన్ వీడియోలతో మొదలైన విమర్శల దాడి ఇవాళ కూడా కొనసాగింది. ఇవాళ ఒకే రోజు ఈ సదస్సులో పాల్గొంటున్న గల్గోటియాస్ యూనివర్సిటీ (Galgotias University) రెండు విషయాల్లో దొరికిపోయింది. దీంతో మొత్తం సదస్సే సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతోంది.

ఇవాళ ఉదయం ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గల్గోటియాస్ యూనివర్శిటీ ప్రదర్శించిన రోబో డాగ్ తొలి వివాదానికి కారణమైంది. అది అచ్చంగా తాము తయారు చేసిందేనని, తమ యూనివర్శిటీ మొత్తం తిరుగుతుందని చెప్పుకున్న ప్రతినిధులకు అంతలోనే షాక్ ఎదురైంది. ఇది చైనా తయారీ రోబోడాగ్ అని అంతా పసిగట్టేశారు. అదే సమయంలో చైనా మీడియా కూడా తమ ప్రొడక్ట్ ను కాపీ కొట్టి ఇలా చెప్పుకోవడమేంటని సోషల్ మీడియాలో భారత్ ను కడిగేస్తోంది. దీంతో అబ్బే ఈ రోబోడాగ్ చైనాదేనని వర్సిటీ ఒప్పుకుంది. ఈ వివాదం నేపథ్యంలో ఏఐ సదస్సులో స్టాల్ తీసేసి వెళ్లిపొమ్మని నిర్వాహకులు ఈ వర్సిటీని ఆదేశించారు.

Galgotias Hit by New Controversy Drone Soccer Event at AI Summit Stirs Row

కానీ ఈ రోబో డాగ్ విషయంలో తాము చెప్పిన మాటల్ని వక్రీకరించారంటూ యూనివర్శిటీ ప్రతినిధి నేహాసింగ్ మీడియా ముందు సమర్ధించుకునే ప్రయత్నం చేసినా ఆ పప్పులేవీ ఉడకలేదు. ఈ వివాదం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే అదే వర్శిటీ తెచ్చిన మరో ప్రొడక్ట్ థర్మోకోల్ డ్రోన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చైనా తయారీ రోబోటిక్ డాగ్ వివాదం తర్వాత యూనివర్శిటీని చుట్టుముట్టిన మరో వివాదం ఇది.యూనివర్శిటీ పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచిన ఈ డ్రోన్ మోడల్ థర్మోకోల్‌తో తయారైంది. ప్లాస్టిక్ ఫిల్మ్‌లో చుట్టి, రబ్బర్ బ్యాండ్‌లతో బిగించబడి ఉన్న దీని తాత్కాలిక నిర్మాణం ఆన్‌లైన్‌లో విమర్శలకు దారితీసింది.

Galgotias Hit by New Controversy Drone Soccer Event at AI Summit Stirs Row

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా వంటి దేశాధినేతలు పాల్గొంటున్న అంతర్జాతీయ సదస్సులో ఇలాంటి నాసిరకం ఉత్పత్తుల ప్రదర్శన తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఎక్స్ యూజర్ రోషన్ రాయ్ ఒక వీడియోను పంచుకుంటూ, "గల్గోటియాలోని నా మిత్రులు అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌లో అక్షరాలా థర్మోకోల్ డ్రోన్‌ను తీసుకొచ్చారు. ఈ యూనివర్శిటీ యూజీసీ గుర్తింపును రద్దు చేయండి, ఇది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది" అని విమర్శించారు. జర్నలిస్ట్ అశుతోష్ మిశ్రా సైతం స్పందిస్తూ, "గల్గోటియా డ్రోన్ మోడల్‌ను చూశారా? అంతర్జాతీయ ఏఐ ఈవెంట్‌లో, గల్గోటియా థర్మోకోల్‌తో చేసిన, రేకుతో చుట్టిన, రబ్బర్ బ్యాండ్‌లతో కట్టిన డ్రోన్ మోడల్‌ని ప్రదర్శించింది. నాలుగో తరగతి పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్‌ల కోసం ఇలాంటివి చేయరా? ప్రజలు ఇదే అడుగుతున్నారు" అని ట్వీట్ చేశారు. రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు ఈ నాాసిరకం ఉత్పత్తుల్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

చివరికి గల్గోటియాస్ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐ సమ్మిట్‌లో ఏర్పడిన గందరగోళానికి క్షమాపణలు కోరింది. పెవిలియన్‌ను నిర్వహిస్తున్న తమ ప్రతినిధులలో ఒకరు తప్పుగా సమాచారం అందించారని, ఉత్పత్తి యొక్క సాంకేతిక మూలాల గురించి ఆమెకు తెలియదని, కెమెరాలో ఉండాలనే ఆమె ఉత్సాహంతో, ప్రెస్‌తో మాట్లాడే అధికారం లేకపోయినా తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంది. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేము ప్రాంగణాన్ని ఖాళీ చేసామని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+