ఎయిర్‌టెల్ యూజర్స్ కు గుడ్ న్యూస్
భారతి ఎయిర్‌టెల్ ప్రముఖ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ Perplexityతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ మొబైల్, Wifi, డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లందరికీ వర్తిస్తుంది. Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌లో అధునాతన AI టూల్స్ ఉన్నాయి. ఇది మెరుగైన సెర్చ్, రీసెర్చ్‌తో పాటు ఉత్పాదకత ఫీచర్లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందొచ్చు.
భారతి ఎయిర్‌టెల్ గురువారం AI ఆధారిత సెర్చ్ ప్లాట్‌ఫారమ్ Perplexityతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఎయిర్‌టెల్ తన ప్రీమియం పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తుంది. సాధారణంగా సంవత్సరానికి ₹17,000 ధర కలిగిన ఈ సబ్‌స్క్రిప్షన్, మొబైల్, వై-ఫై మరియు డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లతో సహా ఎయిర్‌టెల్ యొక్క 360 మిలియన్ల వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ తన 360 మిలియన్ల కస్టమర్లకు ఉచితంగా ₹17,000 విలువైన పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను అందించడం అనేది కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అదే సమయంలో ముఖేష్ అంబానీకి చెందిన జియోతో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో సబ్‌స్క్రైబర్ల తగ్గింపును తగ్గించేందుకు ఇదొక వ్యూహాత్మక చర్యగా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి, భారతి ఎయిర్‌టెల్‌కు సుమారు 390 మిలియన్ల వైర్‌లెస్ కస్టమర్లు ఉన్నారు, రిలయన్స్ జియోకు 472 మిలియన్ల మంది ఉన్నారు. జియో 2.7 మిలియన్ల నికర అదనపు కనెక్షన్లు పొందగా, ఎయిర్‌టెల్ కేవలం 275,000 నికర అదనపు కనెక్షన్లను మాత్రమే పొందింది.

పెర్‌ప్లెక్సిటీ లాంటి బడా ఏఐ సంస్థతో జత కట్టడం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉందని అన్నారు ఎయిర్‌టెల్ వైస్‌ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్.అతి శక్తివంతమైన రియల్ టైమ్ నాలెడ్జ్ టూల్‌ను ఈ భాగస్వామ్యం కొన్ని మిలియన్ల మందికి అందుబాటులోకి తీసుకొస్తుందని అది కూడా ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఇది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.శరవేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ ప్రపంచంలో తమ కస్టమర్లకు ట్రెండ్స్ గురించి వివరించేందుకు లేదా వారిని అప్‌డేట్ చేసేందుకు ఒక టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ మరొక ఏఐ సంస్థతో జతకట్టడం భారత్‌లో ఇదే తొలిసారని విట్టల్ గుర్తు చేశారు.

పెర్ప్లెక్సిటీ ప్రో మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది:
- అపరిమిత రోజువారీ ప్రో సెర్చ్‌లు
- GPT-4.1 మరియు Claude వంటి అధునాతన AI మోడళ్లకు యాక్సెస్
- లోతైన పరిశోధన,విశ్లేషణ సామర్థ్యాలు
- డాక్యుమెంట్ ఆధారిత సమాధానాల కోసం ఫైల్ అప్‌లోడ్‌లు
- ఇమేజ్ ప్రొడక్షన్
- పెర్ప్లెక్సిటీ ల్యాబ్స్‌కు యాక్సెస్ - AIతో కొత్త ఆలోచనలను పరీక్షించడానికి ,రూపొందించడానికి ఒక వేదిక
ఎయిర్‌టెల్ వినియోగదారులు దీన్ని ఎలా పొందగలరు?
కంపెనీ ప్రకారం, ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.ఈ ఆఫర్ విద్యార్థులు ,నిపుణుల నుండి గృహిణులు,తరచుగా ప్రయాణాలు చేసే వారి వరకు విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకర్షించడానికి రూపొందించబడింది. ఇది అదనపు ఖర్చు లేకుండా నిజమైన విలువను ఉత్పాదకతను పెంచుతుంది.

పెర్ప్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు & CEO అరవింద్ శ్రీనివాస్ మాట్లాడారు.భారతదేశంలో మరింత మంది ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వృత్తిపరమైన-స్థాయి AIని అందుబాటులోకి తీసుకురావడంలో ఈ భాగస్వామ్యం కొత్త ఒరవడి సృష్టిస్తుందన్నారు. అది విద్యార్థి అయినా, ఉద్యోగం చేసే నిపుణుడైనా లేదా కుటుంబాన్ని నిర్వహించే వారైనా సరే. పెర్ప్లెక్సిటీ ప్రోతో, సమాచారాన్ని కనుగొనేందుకు, తెలుసుకునేందుకు వినియోగదారులు మరింత స్మార్ట్ మరియు సులభమైన మార్గాన్ని పొందుతారన్నారు.
ఈ భాగస్వామ్యం భారతదేశంలోని ఎయిర్‌టెల్ వినియోగదారులకు AI సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది, సమాచారాన్ని మరింత సులభంగా కనుగొనడానికి మరియు వారి ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications