షాకింగ్: ఏఐ తోనే కాదు.. మెటా ఏఐ యూనిట్ లోనూ భారీగా ఉద్యోగాల కోత
సూపర్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కోసం ఇటీవల కాలంలో భారీగా వేతనాలు ఆఫర్ చేసిన మెటా ఏఐ యూనిట్ నుంచి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం భారతదేశ టెక్ రంగంలో ఉద్యోగ భద్రత పై ఆందోళనలకు కారణంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నామని ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోను ఉద్యోగాల భద్రత లేదనే భావన వ్యక్తమవుతుంది.
మెటా ఏఐ యూనిట్ లో లే ఆఫ్స్
ఏఐ యూనిట్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించాలని మెటా నిర్ణయించడంతో ప్రస్తుతం దీనిపైన చర్చ జరుగుతుంది. మెటా ప్రతినిధి తాజాగా ఈ పరిణామాలను ధృవీకరించారు. మెటా చీఫ్ ఎ ఐ అధికారి అలెగ్జాండర్ వాంగ్ నుంచి ఉద్యోగులకు అందిన అంతర్గత మెమోలో ఈ తొలగింపు లను ప్రకటించారు. అయితే ఈ తొలగింపులు ఇటీవల భారీగా వేతనాలు ప్రకటించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఉద్యోగులను ప్రభావితం చేయవని చెబుతున్నారు.

టెక్ రంగంలో ఆందోళన
ఈ తొలగింపులు కంపెనీ యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నాయని, ఇది కార్యకలాపాలను సులభతరం చేయడానికి మరియు, ప్రధానమైన ప్రాంతాల పైన దృష్టి సారించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయని అలెగ్జాండర్ వాంగ్ చెబుతున్నారు. అయితే మెటా తీసుకునే ఈ చర్య భారతదేశంలో టెక్ ఉద్యోగాల స్థిరత్వం గురించి చర్చలకు అవకాశం ఇచ్చింది
మెటా నిర్ణయంతో ఇతర కంపెనీలపైన ప్రభావం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మెటా ఒక కీలక ప్లేయర్ గా ఉండడంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం ఇతర కంపెనీల పైన కూడా ప్రభావం చూపిస్తుందని టెక్నిక్ నుండి భావిస్తున్నారు. ఇతర కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తాయని, ఇది ఇండస్ట్రీలో ఒక అనిశ్చితికి కారణం అవుతుందనే భావన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలో టెక్ పరిశ్రమ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.
ఉద్యోగులను తొలగించాలని మెటా నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ
మెటా లో జరగనున్న ఈ ఉద్యోగ కోతలు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు, ఫండమెంటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ఇతర ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని కొందరు అంటున్నారు. 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని మెటా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చ కు కారణంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోను ఉద్యోగ భద్రత లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగాల భద్రత లేదు
సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐ మరియు డిజిటల్ పరిష్కారాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది ఆలోచనలో పడ్డారు. టెక్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు ఏది చేసినా ఉద్యోగాల భద్రత ఆశించలేము అనే భావన వ్యక్తం చేస్తున్నారు.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications