ఏఐ అసభ్య వీడియోలపై గూగుల్, యూ ట్యూబ్ లకు ఐశ్వర్యారాయ్ దంపతుల షాక్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు అన్ని రంగాలలో తన సత్తా చాటుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి పనులకే కాదు, సమాజంలో చెడు ప్రభావాలను కూడా చూపిస్తుంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారుచేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియో అనేది అర్థం కాకుండా ఉన్నాయి. అయితే ఇది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు తలనొప్పిగా తయారైంది.

కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు తయారుచేసి వాటిని యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా అనేక వెబ్సైట్లు తమ పేరును ఉపయోగించి వాళ్ళు వస్తువులను కూడా విక్రయిస్తున్నాయి అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

obscene videos by AI Bollywood star couple aishwarya rai abhishek bachchan shocked Google and youtube with defamation

యూ ట్యూబ్, గూగుల్ లకు ఐశ్వర్యారాయ్ దంపతుల షాక్
వీరి పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న వాటిని తొలగించేలా ఆదేశాలు ఇస్తామని కోర్టు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో తాజాగా మరోమారు ఐశ్వర్యరాయ్, అభిషేక బచ్చన్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా యూట్యూబ్, గూగుల్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సంస్థలపైన నాలుగు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.

ఏఐతో చేసిన అసభ్య వీడియోలపై కోర్టులో 4 కోట్ల పరువు నష్టం దావా
ఏఐ సహాయంతో. తయారుచేసిన అసభ్య వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాదు లైంగికపరమైన అసభ్యకరమైన వీడియోలతో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానల్ లో 259 వీడియోల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయని వారి పేర్కొన్నారు. కనక తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా వీడియోలు ఫోటోలను వాడుతున్న గూగుల్, యూట్యూబ్ ల పైన చర్యలు తీసుకోవాలని, నాలుగు కోట్ల పరిహారం ఇవ్వాలని వారు కోర్టుకు విన్నవించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+