రోబో జడ్జీలు వచ్చేశాయ్.. క్షణాల్లో కేసులు పరిష్కారం
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ఏఐ ప్రతి రంగంలోనూ విస్తరించింది. మానవులకు సాధ్యం కాని ఎన్నో సమస్యలను ఏఐ క్షణాల్లో పరిష్కరిస్తోంది. అయితే తాజాగా ఏఐను న్యాయవ్యవస్థలోనూ జొప్పించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలోని కోర్టుల్లో కోట్ల కొద్దీ కేసులు పేరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులను పరిష్కరించేంత సంఖ్యలో న్యాయవాదులు లేరు. దీంతో త్వరితగతిన ఈ కేసులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపాటి నేరాలు, భూ వివాదాలు వంటి సాధారణ కేసుల్లో తీర్పులను వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనుంది. రోబో జడ్జిలు అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) న్యాయవ్యవస్థలోకీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా కోట్లకొద్దీ పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు కొత్తగా రోబో జడ్జిలను ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. ఈ రోబో జడ్జిలు కేసులను వేగవంతంగా పరిష్కరిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు వీటిని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై న్యాయమూర్తులకు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది కేంద్రం. ఈ రోబోలు న్యాయవాదులు త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా సాయ పడతాయి. చిన్న చిన్న కేసులు, సిగ్నల్ జంప్, ట్రాఫిక్ కేసులు, చిన్నపాటి నేరాలు, భూ వివాదాలు వంటి కేసులను పరిష్కరించడంలో న్యాయవాదులకు ఇవి సాయపడనున్నాయి.

ఇప్పటికే న్యాయమూర్తులు రెండు టీమ్స్ గా ఏర్పడి సింగపూర్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇలాంటి విధానం ఇప్పటికే చైనా, ఎస్టోనియా లాంటి దేశాల్లో అమల్లో ఉన్న క్రమంలో వాటిని అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షిస్తోంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ రోబో జడ్జిలను పైలట్ ప్రాజెక్ట్ గా దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, బెంగళూరు, ముంబైలోని కోర్టుల్లో ప్రవేశపెట్టగా విచారణ సమయం దాదాపు 30 శాతం మెరుగుపడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications