ఏఐ ఇంపాక్ట్-2026 ప్రీ- సమ్మిట్.. తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది ఎంపిక

ఇండియా ఏఐ ఇంపాక్ట్-2026 ప్రీ- సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది విద్యార్థులు ఫైనల్ కు ఎంపికయ్యారు. OpenAI అకాడమీ × NXT Wave బిల్డాథాన్ ద్వారా ఈ యువ ఏఐ ఆవిష్కర్తలు ఫైనల్ కు చేరుకున్నారు. IndiaAI Impact 2026 ప్రీ-సమ్మిట్ లో OpenAI అకాడమీ × NXT Wave బిల్డాథాన్ లో భాగంగా 50 టీమ్స్ జెన్ ఏఐ ఇన్నోవేషన్స్ ను రూపొందించనున్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి 1500 మంది బీటెక్ విద్యార్థులు పాల్గొనగా అందులో 100 మంది ఫైనల్ కు చేరుకున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్-2026 ప్రీ- సమ్మిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహించనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరగనుంది.

ఈ బిల్డాథాన్ లో రీజినల్ కాలేజీలు అయిన గీతం వైజాగ్, IIIT కర్నూలు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం, IITM, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్.. తదితర ప్రముఖ కళాశాలల నుంచి B.Tech విద్యార్థులు పాల్గొన్నారు. NXT Wave సీఈఓ, కో ఫౌండర్ రాహుల్ అట్టులూరి మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని టైర్-2 సిటీల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేశామన్నారు. NXT Wave ద్వారా 70 వేల మంది నైపుణ్యం సాధించారని అన్నారు.

Telugu Tech Titans 100 Students Storm OpenAI-NxtWave Buildathon Finale

ఆవిష్కరణల్లో భాగంగా బిజ్నోవా .. ఏఐ పవర్డ్ మల్టీ- లింగువల్ బిజినెస్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫామ్, అలాగే డిజిటల్ క్రిషి ఆఫీసర్.. ఇది ఒక ఏఐ ఫార్మింగ్ అసిస్టెంట్, హెల్త్ మేట్, లీగల్ మైండ్, ఏఐ-ఎఫ్ఐఆర్ విజన్, వ్యోమాన్ ఇంటర్వ్యూవర్, శక్తి, ఫైనాన్సిఫై.. లాంటి ఇన్నోవేషన్లను ఆవిష్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+