IT Layoffs: ఐటీ కంపెనీల లేఆఫ్స్ పై కేంద్రం జోక్యం కోరిన సాయిరెడ్డి..!

కృత్రిమ మేథ, ఆటోమేషన్ కారణాలు చూపుతూ ఉద్యోగుల్ని తగ్గించేందుకు ఐటీ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాజాగా టెక్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఉద్యోగుల్ని తొలగించడంపై స్పందించిన సాయిరెడ్డి ఈ విషయంలో కేంద్రం జోక్యం కోరారు. ఈ మేరకు ఎక్స్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

మన ఐటీ రంగంలో ఉద్యోగుల లేఆఫ్స్ ఆందోళన కలిగిస్తున్నాయని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందని తనకు అర్థం అవుతుందన్నారు. ఉద్యోగుల్ని సాగనంపే బదులు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని ఉపయోగించుకునే మార్గాలను చూడాలని ఐటీ సంస్థల్ని సాయిరెడ్డి కోరారు. అలాగే ఉద్యోగాల తొలగింపులపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని సాయిరెడ్డి కోరారు.

Vijayasai Reddy Urges Centre s Intervention on IT Layoffs Proposes Collaboration

కంపెనీలు లేఆఫ్స్ కు బదులుగా ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అనుసరించడానికి టీసీఎస్, యాక్సెంచర్, విప్రో , ఇతరులతో కలిసి పనిచేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను విజయసాయిరెడ్డి కోరారు. తద్వారా ఐటీ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించకుండా చూడాలని కేంద్రాన్ని సాయిరెడ్డి అభ్యర్ధించారు. తాజాగా టీసీఎస్ తో పాటు పలు సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్న వేళ సాయిరెడ్డి విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.

Vijayasai Reddy Urges Centre s Intervention on IT Layoffs Proposes Collaboration

ఇప్పటికే ఈ ఏడాది 22 వేల మందికి పైగా ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు లేఆఫ్స్ తో తొలగించాయి. ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఈ తొలగింపులు తప్పడం లేదని వివరణలు కూడా ఇస్తున్నాయి. అయితే ఇలా సడన్ గా తొలగించినందుకు పరిహారాలు కూడా సరిగా చెల్లించడం లేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టీసీఎస్ తొలగింపులపై కార్మికశాఖ నోటీసులు ఇచ్చింది. అయితే పూర్తిస్దాయిలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+