అల్లు అర్జున్ రూ. 1,000 కోట్ల మైథలాజికల్ థ్రిల్లర్: దర్శకుడు ఎవరంటే..?

Allu Arjun: అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. పాన్ ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మూవీ ఇది. ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'.

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే ఇందులో కథానాయిక. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కీ రోల్ లో కనిపించింది దీపిక. దాని తరువాత ఆమె నటించనున్న మరో తెలుగు మూవీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ. పాన్ ఇండియాగా టాలీవుడ్ సత్తాను మరోసారి చాటబోతోంది.

Allu Arjun and Trivikram Reunite for a Mythological Epic with Rs 1000 Crore Budget

అల్లు అర్జున్- దీపికా పదుకొణే కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అట్లీ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి. అంతకుముందు ఆమె అట్లీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ లో నటించింది. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ ను పంచుకుంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టింది. వారియర్ క్వీన్ రోల్ లో ఆమె మెరుపులు మెరిపించనుంది. కల్కిలో ఎటువంటి కీలక పాత్రను పోషించిందో.. ఇందులో కూడా అంతే ప్రయారిటీ ఉన్న రోల్ ను ఆమె కోసం డిజైన్ చేశాడు దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోంది.

దీని తర్వాత త్రివిక్రమ్ తో భారీ మూవీ ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. వీరిద్దరూ నాలుగోసారి రీయూనిట్ కాబోతోన్నారు. కలిసి పనిచేయనున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత వస్తున్న వీరి నాలుగో ప్రాజెక్ట్‌ ఇది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు పింక్‌విల్లా ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది. పురాణ ఇతిహాసాలు, భవిష్యత్ ను లింక్ చేస్తూ సినిమా రూపుదిద్దుకోనుంది.

1,000 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో, ఇదివరకెప్పుడూ చూడని స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని టాలీవుడ్ వర్గాలను ఉటంకిస్తూ పింక్ విల్లా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అద్భుతమైన విజువల్స్‌ వండర్ గా నిలుస్తుందని, పౌరాణిక జానర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చేలా పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉండబోతుందని పేర్కంది. 2027 ఫిబ్రవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ నిర్మాత ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+