తెలుగులో ప్యూర్ ఛిల్లింగ్ హార్రర్ ఫిల్మ్: మైత్రీ- ప్రశాంత్ నీల్ బిగ్ ప్లాన్
టాలీవుడ్ లో భారీ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పేరుపొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూట్ మార్చింది. ఓ ప్రయోగానికి తెర తీసింది. ఇప్పుడు హారర్ జానర్‌లోకి ప్రవేశిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ ఛిల్లింగ్ హార్రర్ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా టైటిల్ ను కూడా ఆవిష్కరించిందీ ప్రొడక్షన్ హౌస్. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ లోనే ఏదో ఉందనిపించేలా చేసింది.
ఈ మూవీ టైటిల్.. 418. ప్రశాంత్ నీల్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువ దర్శకుడు కీర్తన్ నాడగౌడ రూపొందిస్తోన్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హార్రర్ జానర్ లో మైత్రీ మూవీ మేకర్స్ అడుగు పెట్టడం, దీనికోసం ప్రశాంత్ నీల్ తో కొలాబరేట్ కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

టైటిల్ రిలీజ్ పోస్టర్ లో 418 అనే నంబర్ ప్రధానంగా కనిపిస్తోంది. రక్తపు మరకలతో లాక్ చేసి ఉన్న తలుపుపై ఆ అక్షరాలు ఉండటం.. సినిమా డెప్త్ ను సూచిస్తోంది. మూసివున్న తలుపుల వెనుక ఉన్మ మర్మం, 418 అనే అంకెల అంతరార్థం హాట్ టాపిక్ అయింది. డార్క్ సీక్రెట్స, లోన్లీ నెస్.. ఇలా అన్నీ ఈ పోస్టర్ లో కలబోశాయి. ఎటువంటి కామెడీ లేకుండా ప్యూర్ హార్రర్ జానర్ లో తెరకెక్కుతోందనడానికి ఇవే ఉదాహరణలు.
"హారర్ సినిమాల్లో నవ్వడం ఇక చాలు.. ఇప్పుడు భయపడాల్సిన సమయం వచ్చింది.." అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టాడంటే దర్శకుడు కీర్తన్ నాడగౌడ గట్స్ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాడాయన. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హారర్-కామెడీ జానర్ కు ఓ సవాల్. ఈ సినిమాకు వెంకీ జీజీ సంగీతం అందించగా, దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. '418'లోని మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను చిత్ర నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications