100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించిన చిత్రం పాతాళభైరవి. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, చక్రపాణిలు నిర్మించిన ఈ జానపద చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.వి. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. 1951 మార్చి 15న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో భారతీయ సినిమా రంగాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో విజయాన్ని సాధించింది.

నాగార్జున 100 వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ ఆ రోజే.. ఫ్యాన్స్ కు పండగే..!
నాగార్జున 100 వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ ఆ రోజే.. ఫ్యాన్స్ కు పండగే..!

తోట రాముడిగా ఎన్టీఆర్

ఈ సినిమాలో తోట రాముడిగా నటించిన నందమూరి తారకరామారావు సాహసోపేతమైన నటనతో మాస్ హీరోగా గుర్తింపు పొందారు. అలాగే నేపాల్ మాంత్రికుడిగా అద్భుతమైన అభినయాన్ని కనబరిచిన ఎస్.వి. రంగారావు, రాజకుమారి ఇందుమతిగా నటించిన కె. మాలతి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం, పింగళి నాగేంద్రరావు రాసిన కథ, మాటలు, పాటలు ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి.

నాగార్జునకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా
నాగార్జునకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా
Pathala Bhairavi The first Telugu movie to achieve a remarkable 100 day theatrical run

28 కేంద్రాల్లో 100 రోజులు

విడుదలైన కొత్తలో రెండు వారాల పాటు సాధారణ ప్రదర్శనగా సాగిన ఈ సినిమా, మూడో వారం నుండి ఊహించని రీతిలో ప్రేక్షక ఆదరణ పొందింది. ఆ కాలంలో ఏ తెలుగు సినిమా సాధించని విధంగా ఏకంగా 28 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవ రికార్డును నెలకొల్పింది. అంతటితో ఆగకుండా 4 ప్రధాన కేంద్రాలలో 175 రోజులు (సిల్వర్ జూబ్లీ) ఆడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పాతాళభైరవి కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. 1952లో ముంబైలో నిర్వహించిన మొదటి "ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్" లో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచి, తెలుగు సినిమా ఘనతను దేశవిదేశాల్లో చాటిచెప్పింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+