వెంకటేష్ వద్దంటే బాలయ్య చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
విక్టరీ వెంకటేష్ ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఘనవిజయాలు సాధిస్తూ వచ్చారు. అటువంటి వెంకీ 1997లో ప్రేమించుకుందాం రా సినిమా చేశారు. అది ప్రేమ కథే అయినా అందులో కొంత ఫ్యాక్షన్ జోడించారు. సినిమా మొత్తం కాకపోయినా ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? రాయలసీమలో ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది? అనే విషయాలను చాలా తక్కువగా చెప్పారు. సినిమాలో ప్రధాన పాయింట్ మాత్రం ప్రేమ. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
తర్వాత దర్శకుడు బి.గోపాల్ పూర్తిస్థాయిలో ఓ ఫ్యాక్షన్ సినిమా తీయాలనుకున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన కథను తీసుకొని వెంకటేష్ దగ్గరకు వెళ్లారు. కథ వెంకీకి బాగా నచ్చింది. అయితే కుటుంబ చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు చేసే తనకు అంతటి శక్తివంతమైన ఫ్యాక్షన్ కథ నప్పదేమో అని గోపాల్ కు చెప్పారు. కథలో హింస కూడా చాలా ఎక్కువగా ఉంది.. ఇది బాలయ్యకు అయితే బాగా సరిపోతుందని చెప్పారు. దీనికి గోపాల్ కూడా ఓకే అన్నారు.

దక్షిణదిలో రికార్డు
తర్వాత బి.గోపాల్ ఈ కథను బాలయ్యకు వినిపించగా వెంటనే ఓకే చెప్పారు. దీంతో సత్యానారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై చెంగల వెంకట్రావు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 1999 జనవరి 13న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. నేరుగా 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడి దక్షిణాదిలో తొలి సినిమాగా రికార్డు నెలకొల్పింది. బాలయ్య, అంజలా జవేరి, సిమ్రాన్, సత్యనారాయణ, సంఘవి, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించారు. మణిశర్మ అద్భుతమైన బీజీఎం, అద్భుతమైన పాటలను అందించారు. ఇలా వెంకటేష్ వద్దనుకున్న కథ బాలయ్య దగ్గరకు చేరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
నరసింహుడు తీసి మునిగిపోయారు
అయితే ఈ కథ బాలయ్యకు బాగుంటుందని చెప్పింది వెంకటేష్. వెంకీ, బాలయ్య ఇప్పటికీ చాలా స్నేహంగా ఉంటారు. ఈ సినిమా తర్వాత నిర్మాత చెంగల వెంకట్రావు జూనియర్ ఎన్టీఆర్ తో బి.గోపాల్ దర్శకత్వంలోనే నరసింహుడు సినిమా తీశారు. భారీ పరాజయం పాలవడంతో నిర్మాత పూర్తిగా మునిగిపోయారు. బాలయ్య రికమండేషన్ తో పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల చెంగల వెంకట్రావు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications