స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు
ఎంతోమంది సాధారణ హీరోలు స్టార్ హీరోలుగా మారారంటే అందుకు కారణం ఒక్కటే. వారు నటించే సినిమాల్లో బలమైన ప్రతినాయకుడు ఉండటంవల్లే. ప్రతినాయకుడు ఎంత శక్తివంతంగా, హీరోకు ధీటుగా ఉంటాడో, అప్పుడే హీరోయిజం అనేది కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఆ హీరో స్టార్ హీరో అవుతారు. అంటే శక్తివంతమైన విలన్లవల్లే స్టార్ హీరోలు అయినవారు మన దగ్గర ఎంతోమంది ఉన్నారు. విలన్ ఎంత బలంగా ఉంటే.. హీరో విజయం అంత గొప్పగా ఉంటుంది అనేది వెండితెర సత్యం. బాలకృష్ణ, మోహన్ బాబు హీరోలుగా నటించిన సినిమాల్లో మీరు గమనిస్తే విలన్లు అత్యంత శక్తివంతంగా ఉంటారు. సినిమాల్లో హీరోలకన్నా విలన్లుగా నటించి వారికన్నా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నవారెవరంటే..
నీలాంబరిని మించినవారు లేరు
భారతీయ చలనచిత్ర చరిత్రలో విలన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు 'నరసింహ' చిత్రంలోని నీలాంబరి. రమ్యకృష్ణ ఈ పాత్రలో ఒలికించిన అహంకారం, కళ్లల్లో కనిపించే కసి, నరసింహపై ఆమెకు ఉన్న వింతైన మోజు వెరసి ఆ పాత్రను ఒక లెజెండరీ హోదాలో నిలబెట్టాయి. క్లైమాక్స్‌లో ఆమె మరణం కంటే, ఆ పాత్ర చూపించిన రాజసం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి. బాలీవుడ్ క్లాసిక్ 'షోలే'లో అంజద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర విలనిజానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
"అరే ఓ సాంబ.. కిత్నే ఆద్మీ థే" అనే ఒక్క డైలాగ్ దశాబ్దాలు గడిచినా నేటికీ మార్మోగుతూనే ఉంది. ఆ రాయిపై నిలబడి, నవ్వుతూనే భయం పుట్టించే గబ్బర్ సింగ్ మేనరిజం వెండితెరపై ఒక చెరగని ముద్ర వేసింది. డైలాగ్ డెలివరీలో ఆ వైవిధ్యమే ఆ పాత్రను చిరస్థాయిగా నిలిపింది.

గోపీచంద్ కు ధీటైనవారే లేరు
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలతోనే సంచలనం సృష్టించిన నటుడు గోపీచంద్. 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో ఆయన చూపించిన క్రూరత్వం, మేనరిజమ్స్ హీరోలకు గట్టి పోటీనిచ్చాయి. ఇక సోనూ సూద్ 'అరుంధతి' చిత్రంలో పోషించిన పశుపతి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మంత్ర తంత్రాల నేపథ్యం, ఆ గంభీరమైన కంఠస్వరం ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఆ సినిమా భారీ విజయంలో పశుపతి పాత్ర పాత్ర సింహభాగం అని చెప్పవచ్చు.
మాయాబజారులో ఎస్వీ రంగారావు ఘటోత్కచుడిగా చూపించిన విలనిజం, హాస్యం ఒక అద్భుతం. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా రానా చూపించిన శారీరక దారుఢ్యం, కుతంత్రాలు ప్రభాస్ పాత్రకు సరైన జోడీగా నిలిచాయి. ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ ఓబ్లు.. ఐ లవ్ యూ అంటూ ఆయన పండించిన విలనిజం ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అవకాశం రావాలే కానీ, పరకాయ ప్రవేశం చేసి హీరోలను మించిపోయే నటన ప్రదర్శించే ప్రతినాయకులు మన తెలుగు చిత్రసీమలో ఎంతోమంది ఉన్నారు.












Click it and Unblock the Notifications