వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాతీయ పార్టీలు పొత్తుల బేరాలు మొదలుపెట్టాయి. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వైసీపీ చీఫ్ జగన్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలురాగా.. తాజాగా కాంగ్రెస్ సైతం వైసీపీ, టీఆర్ఎస్‌తో బేరాలు కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం లేకపోవడంతో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం తెలుగు పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. మోడీతో వైరం పెంచుకున్న చంద్రబాబు కొత్త ప్రధాని వస్తారంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. అయితే ఫలితాల అనంతరం టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ పార్టీమరో ఆప్షన్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం.

By Sidelining TDP Congress holding Secret meeting with YSRCP, TRS for post-poll tie-up?

ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌ను తనవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వైసీపీ నాయకలుతో సంప్రదింపులు జరపగా.. మహారాష్ట్రకు చెందిన మరో నేత టీఆర్ఎస్ ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్, వైసీపీలు వారికి ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ ఒక షరతుపై మద్దతిస్తామని చెప్పినట్లు సమాచారం.

బీజేపీయేతర పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చినా ఆ కూటమిలో చంద్రబాబు ఉంటే తాము అందులో చేరే ప్రసక్తేలేదని టీఆర్ఎస్, వైసీపీలు చెప్పినట్లు తెలుస్తోంది. కూటమిలో బాబు ఉంటే కనీసం బయటి నుంచి మద్దతు కూడా ఇవ్వమని తేల్చిచెప్పినట్లు సమాచారం. టీడీపీ కావాలా లేక టీఆర్ఎస్, వైసీపీల మద్దతు కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీఆర్ఎస్‌ల కోసం టీడీపీని దూరం పెట్టడమే ఉత్తమమన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నారు. టీడీపీని పక్కనబెట్టి టీఆర్ఎస్, వైసీపీలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోందన్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

English summary
By Sidelining TDP Congress holding Secret meeting with YSRCP, TRS for post-poll tie-up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X