వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలకులను ఎన్నుకునేది 60శాతం ఓటర్లేనా? అందరూ ఓటేసేలా చేయలేమా? మీ కామెంట్ చెప్పండి

|
Google Oneindia TeluguNews

సామాన్యుడి ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించినప్పుడే సమర్థులైన నాయకులను ఎన్నుకోగలం. ప్రజలు అత్యంత విలువైన ఓటును వేయకపోతే ఓటర్లుగా ఓడిపోయినట్లే లెక్క. కానీ గత కొన్ని దశాబ్దాలుగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎంత నిరాసక్తతతో ఉన్నారో అర్థమవుతుంది. ఓటు హక్కు వినియోగంలో ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాల కన్నా గ్రామాల్లో ఓటర్లే నయం. ఎలక్షన్ కమిషన్ లెక్కలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి.

ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలతో పాటు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినా ఓటర్లలో మాత్రం చైతన్యం రావడంలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 66.38 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. అంటే 33.62శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఇది సార్వత్రిక ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం.

Is it Fair that Only 60% of the voters deciding the rulers

దీన్ని బట్టి ఓటు విషయంలో జనం ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేశంలో కేవలం 65శాతం ఓటర్లు మాత్రమే ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంలో పాలుపంచుకోవడం, మిగిలిన 33శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఎంత వరకు సమంజసం? ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

English summary
Is it Fair that Only 60% of the voters deciding the rulers? Can't we take measures to ensure everyone participate in the voting? Please post your comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X