కేసీఆర్ "హిందూగాళ్లు బొందుగాళ్లు" వివరణ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా...మీ అభిప్రాయం ఏమిటి..?
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ కామెంట్స్‌ను పరిశీలించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రానికల్లా వివరణ కోరింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తన వివరణను ఓ లేఖలో రాసి సీల్డుకవర్‌లో ఈసీకి పంపారు. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల సంఘం కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా... దీన్నిపై మీ కామెంట్ చెప్పండి













Click it and Unblock the Notifications