వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ ఫెయిల్ కావడానికి కారణాలేంటని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది. నాలుగు కీలక నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు నిర్వహించిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. భారీ జన సమీకరణకు ప్లాన్ వేసినా ప్రజలెవరూ సభకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలు తూతూ మంత్రంగా సభ నిర్వహించారు.

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికి మిర్యాలగూడ బహిరంగసభలో ఉన్న కేసీఆర్ తన ప్రసంగం మధ్యలో హైదరాబాద్ సభకు ఆలస్యమవుతోందన్న అంశాన్ని ప్రస్తావించారు. అయితే మీటింగ్ ప్రారంభ సమయం దాటినా జనం లేక స్టేడియం వెలవెలబోయింది. ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియం సభను రద్దుచేసుకున్నారు. నల్గొండ నుంచి బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రగతిభ‌వన్‌కు వెళ్లిపోయారు. జన సమీకరణలో విఫలమైన నాయకులపై సీరియస్ అయిన సీఎం వారికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

What are the reasons behind cm KCR skipping election rally at lb stadium?
English summary
What are the reasons behind cm KCR skipping election rally at lb stadium? please post your comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X