వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతతనిచ్చే పూజ గది..ఇంట్లో ఎక్కడ ఉండాలి, ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రతి కుటుంబానికీ మూల దైవం అంటూ ఒక దేవత ఉంటారు. వారికి సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను పెట్టి పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలో ఉండటానికే చోటు కరువైన స్థితిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదినే కేటాయించడం అన్నది సమస్యగా మారుతున్నది. అయినా దైవభక్తి అధికంగా ఉన్నవారు దేవుడికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకుంటారు. అటువంటి వారు వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు అన్నది చూద్దాం...

పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా పశ్చిమ దిక్కున ఏర్పా టు చేయాలి. దీనికి కారణం తెల్లవారు జామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది.పెద్ద స్థలం ఉన్నవారైతే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మధ్య భాగాన్ని గాలి, వెలుతురు సవ్యంగా పారేందుకు ఖాళీగా ఉంచాలి. ఆ మధ్య ప్రదేశంలో పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు.

Do you know where the Pooja room should be in the house,Know here

పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. సూర్యుడి తొలి కిరణాల వల్ల లబ్ది పొందలేరు. అలాగే పూజ గదిని పై అంతస్థులలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్దవారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.

ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి. అయితే పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. దీనికి కారణం దేవుడి వైపు కాళ్ళు పెట్టి పడుకోవడానికో లేక దేవుడు ఉన్నాడనే భావనతోనో నిద్రించలేరు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లేకుండా చూసుకోవాలి. అక్కడి నుంచి వచ్చే శబ్దాలు, వాసనలు వ్యక్తులను డిస్టర్బ్‌ చేస్తాయి.

ఒకవేళ ప్రత్యేకంగా పూజగదినే ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటుపెట్టుకోవాలన్నది చాలా మంది సందేహం. ఈ విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి విగ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కున, తల ఉత్తరం దిక్కున ఉంటాయి.

దీని వల్ల శరీరంలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే ఐస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి. అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒక దానిని ఒకటి చూసుకోరాదు.

గోడకు ఒక అంగుళం దూరంలో విగ్రహాలు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరొత్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపాలు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముం దే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనుపిస్తాయి. పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. అంతేకాదు సూర్య కిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డం ఉండవు.

నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ గదిలో డబ్బు ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. కారణం దాని వల్ల గది మరింత కుదురుగా కనుపిస్తుంది. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులవవుతుంది.

English summary
Always see that the pooja room in the house is towards north east,west or east.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X