నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి.
ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. రీసెంట్ గా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం. ఈ స్కీమ్ తో ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

A great offer for the unemployed a new scheme that gives 5 thousand per month

పీఎం ఇంటర్న్ షిప్ పథకం వివరాలు..

ఈ స్కీము కింద నిరుద్యోగులకు ఏడాదిపాటు ట్రైనింగ్ అందించనున్నారు. ఉపాధి కల్పిచండంతో పాటు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 5వేల స్టై ఫండ్ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. ఇలా ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ లెక్కన నెలకు ఐదు వేలు అంటే.. సంవత్సరానికి రూ. 60వేలు అందించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రధాన్ మంత్రి జీవన్ బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వంటి స్కీమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుందని అర్దం అవుతోంది. ఆరు నెలలు ఇంటర్న్ షిప్ తర్వాత వారికి ఉపాధి లభిస్తుంది.

ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారంతా అర్హులని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11వ తేదీ వరకే సమయం ఉందని చెబుతున్నారు. ఇందుకు 21 నుంచి 24 ఏళ్ల లోపు వారు అర్హులని వివరించారు. అందుకోసం https://pminternship.mca.gov.in/login/ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.

రిజిస్టర్ చేసుకునే విధానం..

రిజిస్టర్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పైన ఇవ్వబడిన లింకు ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వివరాలన్నింటిని అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+