అభ్యర్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్స్ 2025 షెడ్యూల్ వచ్చేసింది..!
జేఈఈ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. జేఈఈ మెయిన్స్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి పూర్తి నోటిఫికేషన్‌ను చూడొచ్చు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను jeemain.nta.nic.in లేదా nta.ac.in సంప్రదించగలరు.
ఈసారి మొదటి సెషన్ జనవరి 22వ తేది నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే, రెండో సెషన్ ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. మొదటి సెషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 28వ తేది నుంచి నవంబర్ 22వ తేది వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సెషన్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కానున్నాయి. అయితే ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ ను సంప్రదించగలరు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

పరీక్షా విధానం..
జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షకు అర్హత సాధించాలంటే, జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ఉత్తీర్ణతనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్స్ పేపర్ 1లో పొందిన స్కోర్ ఆధారంగానే దేశవ్యాప్తంగా ఉన్న నిట్, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో బీఈ లేదా బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే, పేపర్ 2 ద్వారా బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. జేఈఈ మెయిన్స్ పరీక్షలో మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్-2 ఉంటుంది. మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 ఎగ్జామ్ 300 మార్కులు, పేపర్-2 ఎగ్జామ్ 400 మార్కులకు ఉంటుంది.












Click it and Unblock the Notifications