AP DSC 2024: రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్... ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ..
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. రాష్ట్రంలో రేపు మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ వెలువడనుంది. టెట్ ఫలితాలను నవంబర్ 4వ తేదిన విడుదల చేసిన విద్యాశాఖ ఇక మెగా డీఎస్సీ ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 6న మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నట్లు సమాచారం. మొత్తం నెల రోజుల పాటు ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నిర్వహించే డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్నాయి.సుమారు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటనను విడుదల చేసేందుకు విద్యాశాఖ పలు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 6371 ఉండగా, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు 7725 ఉంటాయి. టీజీటీ పోస్టులు 1781 ఉండగా, పీజీటీ పోస్టులు 286 ఉన్నాయి. ఇక ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉండగా, పీఈటీ పోస్టులు 132 వరకు ఉండనున్నాయి. రేపు వెలువడే ఈ నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల సంఖ్య కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలులో అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో ఉన్నాయి.

ఒకేసారి రెండు మూడు జిల్లాలు..
టెట్ పరీక్షల నిర్వహణ మాదిరిగానే డీఎస్సీ పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. అందుకే డీఎస్సీ పరీక్షలను అనేక విడతల్లో నిర్వహించాల్సి వస్తుంది. ఎస్జీటీ పోస్టులకు పోటీ పడేవారు పంఖ్య అధికంగా ఉండటంతో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేయక తప్పదు. అందుకే ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని కోణంలో రాష్ట్ర విద్యా శాఖ ఆలోచిస్తోంది. ఈ విషయంపై స్పషత రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే..!












Click it and Unblock the Notifications