Jobs: రామచంద్రపురంలో 25న జాబ్ మేళా..! కంపెనీలు, ఉద్యోగాలివే..!
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో ఈ నెల 25 ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహిస్తోంది. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో ఏయే ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నారు, ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయి, అందుబాటులో ఉండే ఉద్యోగాల వివరాలను మంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. వీటి ఆధారంగా నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరై దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్ మేళా జరగబోతోంది. 25న ఉదయం 9 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్, భారత్ బయోటెక్, మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్లు కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్ , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన 18 నుండి 27 సంవత్సరాలు లోపు అభ్యర్థులకు సుమారు రూ.13,500 నుండి రూ.30 వేల జీతంతో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. టెక్నీషియన్, విజువల్ ఇన్ స్పెక్టర్స్, క్వాలిటీ చెకింగ్, అసెంబ్లింగ్ ఆపరేటర్, ప్రొడక్షన్ స్టాఫ్ ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. బయోలాజికల్ ఫార్మాలో టెన్త్, ఇంటర్ 18 నుండి 40 సంవత్సరాల లోపు అభ్యర్థులకు 13500 జీతముతో ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.

రామచంద్రపురం కేవీర్ హాస్పిటల్ వెనుక గల ఉపాధి భవన్ లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సత్యం వాసంశెట్టి, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంకుమార్ లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9515481671, 9948919949 నెంబర్లను సంప్రదించాలని కోరారు.












Click it and Unblock the Notifications