ఏపీ ఎస్సై తుది రాత పరీక్షప్రాథమిక ‘కీ’ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శని, ఆదివారాల్లో విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. శనివారం జరిగిన పేపర్-1(ఇంగ్లీష్), పేపర్-2(తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రెండో రోజైన ఆదివారం జరిగిన పేపర్-3(అరిథమెటిక్, మెంటల్ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్-4(జనరల్ స్టడీస్) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారు. కాగా, పేపర్-3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతోపాటు ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ(APSLPRB) తాజాగా విడుదల చేసింది.

సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో [email protected]కు మెయిల్ చేయవచ్చని సూచించింది. ఆ తర్వాత తుది కీతోపాటు ఫలితాలు వెలువరించనున్నారు. ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ సంప్రదించి తెలుసుకోవచ్చు.
పేపర్-3 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పేపర్-4 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications