APPSC Group2 Prelims Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల-లిస్ట్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఇప్పటికే అభ్యర్ధులు ఈ ఫలితాల కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో సర్వీస్ కమిషన్ ఇవాళ ఈ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష కోసం ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద ఖాళీగా ఉన్న 899 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో 2557 మంది అభ్యర్ధుల్ని తిరస్కరించారు. అలాగే 92250 మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు జాబితాల్ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని ఏపీపీఎస్సీ జూలై 28న నిర్వహించాల్సి ఉంది. అంటే దాదాపు రెండు నెలలకు పైగా వ్యవధి లభించింది. దీంతో అభ్యర్ధులు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం లభించింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల జాబితాలను మీ సౌలభ్యం కోసం వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాం. కాబట్టి అభ్యర్ధులు ఇందులో తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
Download











Click it and Unblock the Notifications