APPSC Group2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారు..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మెయిన్స్ కు ఎంపిక నిష్పత్తిని పెంచాలని అభ్యర్ధుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏపీపీఎస్సీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీపీఎస్సీ తాజాగా నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈ వారాంతంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్ధులు ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేయగానే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వాటిని తెలుసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వెబ్ సైట్ లోనే స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ కు అర్హత సాధించాలంటే అభ్యర్ధులను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మెయిన్స్ కు అభ్యర్ధుల అర్హత నిష్పత్తిని కనీసం 1:100కు పెంచాలని అభ్యర్ధులు కోరుతున్నారు. దీనిపై ఏపీపీఎస్సీ పరిశీలన చేస్తోంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల, పరీక్ష తేదీకి మధ్య గ్యాప్ తక్కువగా ఉండటం, ఇతరత్రా కారణాలతో ఇలా మెయిన్స్ ఎంపిక నిష్పత్తి పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఫలితాల విడుదల లోగానే ఏపీపీఎస్సీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications