ఎగ్జామ్ లేకుండానే జాబ్స్.. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ !!
నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మరోసారి తీపి కబురు ప్రకటించింది. ఈసారి మొత్తం 281 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కొత్తగా కోర్సు పూర్తి చేసుకొని కెరీర్ ప్రారంభించే వారికి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. కాగా జీతం సహా మరిన్ని వివరాల గురించి వెల్లడించకపోయినప్పటికీ.. అప్రెంటిస్‌గా చేరి మంచి టెక్నికల్ అనుభవం పొందవచ్చు. ఆ తర్వాత వీరిని భవిష్యత్‌లో పర్మనెంట్ ఉద్యోగులుగా మార్చే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

జిల్లాల వారీగా పోస్టులు..
మొత్తం పోస్టులు..
281
ఈ రిక్రూట్మెంట్ ద్వారా నాలుగు జిల్లాల్లోని అప్రెంటిస్ పోస్టులు భర్తీ కానున్నాయి.
- చిత్తూరు జిల్లా : 48 పోస్టులు
- తిరుపతి జిల్లా : 88 పోస్టులు
- నెల్లూరు జిల్లా : 91 పోస్టులు
- ప్రకాశం జిల్లా : 54 పోస్టులు
ఖాళీల విభాగాలు..
ఈ ఉద్యోగాలు పలు టెక్నికల్ ట్రేడుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:
- డీజిల్ మెకానిక్
- మోటార్ మెకానిక్
- ఎలక్ట్రీషియన్
- వెల్డర్
- పెయింటర్
- మెషినిస్ట్
- ఫిట్టర్
- డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)
అర్హతలు..
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థి భారత పౌరుడు అయ్యి వయసు పరిమితి సంబంధిత నియమావళి ప్రకారం ఉండాలని సూచిస్తున్నారు.
ఎంపిక విధానం..
- ఈ రిక్రూట్మెంట్‌లో రాత పరీక్ష ఉండదు.
- అభ్యర్థుల ఎంపిక ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.
- ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కాకుటూరు (నెల్లూరు జిల్లా)లోని ఆర్‌టీసీ జోన్‌ల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరుగుతుంది.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి రెజ్యూమ్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో పూర్తి వివరాలు నమోదు చేయాలి. అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జత చేసి కింద ఇచ్చిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రూ.100 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు గడువు..
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 4
సర్టిఫికెట్ల కాపీలు పంపడానికి చివరి తేదీ: 2025 అక్టోబర్ 6












Click it and Unblock the Notifications