సీబీఎస్‌ఈ టెన్త్, ఇంట‌ర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌చేసుకోండి!

సీబీఎస్‌ఈ టెన్త్, ఇంట‌ర్‌ ఫలితాలు విడుదల‌య్యాయి. ముందుగా ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన సిబిఎస్ఈ ఆ త‌ర్వాత ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. సీబీఎస్ఈ ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థులు రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌లను ఎంటర్ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో cbse.gov.in, https://cbseresults.nic.in/ విద్యార్థుల‌ స్కోరు కార్డును ప‌రిశీలించుకోవ‌చ్చు. డిజీలాకర్‌, ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్ చెక్‌చేసుకునే వెసులుబాటును క‌ల్పించారు.

ముందుగా ప్ర‌క‌టించిన ఇంట‌ర్ ఫ‌లితాలను ఓసారి ప‌రిశీలిస్తే..ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఈ సంవ‌త్స‌రం మొత్తం 87.98శాతం మంది ఇంట‌ర్‌లో ఉత్తీర్ణత సాధించారు. 91.52శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలే ముందు వ‌రుస‌లో ఉన్నారు. 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాల్లో 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు సీబీఎస్ఈ బోర్డు ప్ర‌క‌టించింది.

CBSE 10th Inter results released Check this

వివిధ ప్రాంతాల వారీగా ఉత్తీర్ణ‌త వివ‌రాలు..

సీబీఎస్ఈ ఇంట‌ర్ ఫ‌లితాల్లో అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం రాగా, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను ప్ర‌క‌టించ‌డంలేదు. ఇందుకు గ‌ల కార‌ణం లేక‌పోలేదు. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు..

సీబీఎస్ఈ పదో తరగతి ప‌రీక్ష‌లు ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ‌లితాల్లో మొత్తం 93.60శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. 47,983 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించారు. వివిధ ప్రాంతాల వారీగా ఉత్తీర్ణ‌త వివ‌రాలు చూసుకున్న‌ప్పుడు అత్యధికంగా తిరువనంతపురంలో 99.75శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30శాతం, బెంగళూరులో 99.26శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+