CBSE Board Exams Deferred: రేపు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా..!
కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు (CBSE) బోర్డు 10, 12 క్లాసుల పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పలు చోట్ల బోర్డు పరీక్షల్ని వాయిదా వేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇలా పరీక్షలు వాయిదా పడింది భారత్ లో కాదు. విదేశాల్లో మాత్రమే. మార్చి 2న జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షల్ని ఆయా దేశాల్లో వాయిదా వేస్తూ సీబీఎస్ఈ ఆదేశాలు ఇచ్చింది.
మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మార్చి 2 జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. మార్చి 2 న జరగాల్సి 10, 12వ తరగతి పరీక్షలు రెండూ వాయిదా పడ్డాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ పై చేస్తున్న దాడుల నేపథ్యంలో ఆ దేశం తమ పొరుగున ఉన్న ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై ప్రతిదాడులకు దిగింది. దీంతో ఇరాన్ తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఈఏ సహా అనేక మధ్యప్రాచ్య దేశాలలో పరీక్షలు వాయిదా వేశారు.

మార్చి 3న బోర్డు తాజా పరిస్థితిని మళ్ళీ సమీక్షించి మార్చి 5, 2026 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది భారత్ తో పాటు మొత్తం 26 దేశాల్లో 46 లక్షల మంది విద్యార్ధులు సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షల్ని రాస్తున్నారు. ఇందులో భారత్ లో పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా మధ్య ప్రాచ్య దేశాల్లో రాస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా దేశాల్లో ఏ క్షణాన ఏ బాంబు, క్షిపణి వచ్చి మీద పడుతుందా అన్న పరిస్ధితులున్నాయి. దీంతో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications