ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు !
కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఖాళీగా ఉన్న పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో భాగంగా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 230 పోస్టులు భర్తీ చేయబడనున్నారు.
ప్రస్తుతం UPSC షార్ట్ నోటీస్ మాత్రమే విడుదల చేసింది. పూర్తి వివరాలు, సిలబస్, పరీక్షా తేదీలు తదుపరి రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత రంగంలో అదనపు సర్టిఫికేషన్లు లేదా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

ఖాళీ పోస్టుల వివరాలు..
ఎన్విరాన్మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్ - 156 పోస్టులు
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) - 74 పోస్టులు
వయోపరిమితి..
ఎన్విరాన్మెంట్/అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు:
జనరల్ అభ్యర్థులు: 35 ఏళ్లు
OBC అభ్యర్థులు: 38 ఏళ్లు
SC/ST అభ్యర్థులు: 40 ఏళ్లు
PWD అభ్యర్థులు: 45 ఏళ్లు
APFC పోస్టులకు:
జనరల్ అభ్యర్థులు: 30 ఏళ్లు
OBC అభ్యర్థులు: 33 ఏళ్లు
SC/ST అభ్యర్థులు: 35 ఏళ్లు
PWD అభ్యర్థులు: 40 ఏళ్లు
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జులై 29, 2025
చివరి తేదీ: ఆగస్టు 18, 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌లో www.upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం..
రాత పరీక్ష (ప్రిలిమ్స్/మెయిన్స్)
ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్
పరీక్ష సిలబస్, మార్కుల విభజన, నమూనా ప్రశ్న పత్రాలు నోటిఫికేషన్‌లో తర్వాత అందుబాటులోకి వస్తాయి.
రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్ మరియు OBC అభ్యర్థులకు రూ.25 - రూ.100 మధ్య ఫీజు ఉండే అవకాశం ఉంది. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉండవచ్చు. నియామకాలు దేశ స్థాయిలో జరుగుతాయి. పోస్టింగ్‌లు EPFO రీజినల్ కార్యాలయాలు లేదా కేంద్ర కార్యాలయాల్లో ఉంటాయి.
జీతం..
ఎంపికైన వారికి 7వ వేతన కమిషన్ ప్రకారం జీతం అందుతుంది.
ప్రారంభ జీతం (లెవల్-7/లెవల్-10 పే మ్యాట్రిక్స్ ప్రకారం) రూ.44,900 - రూ.1,77,500 మధ్య ఉండే అవకాశం ఉంది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications