భారీ జీతంతో 7,267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ !!
గిరిజన ప్రాంతాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం పెద్దఎత్తున ఉపాధ్యాయులు.. సిబ్బందిని నియమిస్తూ ఈ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నారు. కాగా అందులోనే భాగంగా లేటెస్ట్ గా ఆ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అందులో భాగంగానే 2025 సంవత్సరానికి EMRSలో 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 23, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ nests.tribal.gov.in వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు..
7,267
పోస్టుల వివరాలు..
- ప్రిన్సిపల్ - 225
- పీజీటీ (Post Graduate Teacher) - 1,460
- టీజీటీ (Trained Graduate Teacher) - 3,962
- హాస్టల్ వార్డెన్ (Male) - 346
- హాస్టల్ వార్డెన్ (Female) - 289
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Clerk) - 228
- అకౌంటెంట్ - 61
- స్టాఫ్ నర్స్ (Female) - 550
- ల్యాబ్ అటెండెంట్ - 146
విద్యార్హతలు..
- ప్రిన్సిపల్ - పీజీ డిగ్రీ + బీ.ఎడ్.
- పీజీటీ - సంబంధిత సబ్జెక్టులో పీజీ + బీ.ఎడ్.
- టీజీటీ - సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ + బీ.ఎడ్.
- ఫీమేల్ స్టాఫ్ నర్స్ - బి.ఎస్సీ నర్సింగ్.
- హాస్టల్ వార్డెన్ - ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్.
- అకౌంటెంట్ - కామర్స్‌లో గ్రాడ్యుయేషన్.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 12వ తరగతి ఉత్తీర్ణత.
- ల్యాబ్ అటెండెంట్ - 10వ తరగతి లేదా 12వ తరగతి (సైన్స్ సబ్జెక్టులు) + ల్యాబ్ టెక్నిక్ డిప్లొమా.
వయోపరిమితి..
- ప్రిన్సిపల్ - గరిష్టంగా 50 ఏళ్లు
- పీజీటీ - 40 ఏళ్లు
- టీజీటీ - 35 ఏళ్లు
- హాస్టల్ వార్డెన్ / స్టాఫ్ నర్స్ - 35 ఏళ్లు
- అకౌంటెంట్ / ల్యాబ్ అటెండెంట్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 30 ఏళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం..
- ప్రిన్సిపల్ - రూ.78,800 - రూ.2,09,200
- పీజీటీ - రూ.47,600 - రూ.1,51,100
- టీజీటీ - రూ.44,900 - రూ.1,42,400
- అకౌంటెంట్ - రూ.35,400 - రూ.1,12,400
- స్టాఫ్ నర్స్ / హాస్టల్ వార్డెన్ - రూ.29,200 - రూ.92,300
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - రూ.19,900 - రూ.63,200
- ల్యాబ్ అటెండెంట్ - రూ.18,000 - రూ.56,900
దరఖాస్తు రుసుము..
- ప్రిన్సిపల్ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500
- పీజీటీ & టీజీటీ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,000
- నాన్-టీచింగ్ పోస్టులకు - జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,500
- మహిళలు / ఎస్సీ / ఎస్టీ / పీహెచ్ అభ్యర్థులకు - అన్ని పోస్టులకు రూ.500 మాత్రమే
దరఖాస్తు గడువు..
- సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 23, 2025 వరకు
ఎంపిక విధానం..
- అభ్యర్థులను రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
అర్హత కలిగిన వారు nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించే ముందు అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు.












Click it and Unblock the Notifications