Forest Department : ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్...689 పోస్టులు..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటికే వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం. ఏపీలోని టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా గుడ్‌న్యూస్‌ను అందించింది. టెట్, డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇప్పడు తాజాగా అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పోస్టుల ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను కల్పిస్తుంది. ఇక ఈ ఉద్యోగాల బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షలో సాధించిన అర్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా 689 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీగా ఉన్న సైనిక సంక్షేమాధికారుల పోస్టులు : వీటితో పాటు హోంశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 7 జిల్లా సైనిక సంక్షేమాధికారుల పోస్టులను కూడా భర్తీచేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఇక, ఈ పోస్టులకు రక్షణశాఖ నుంచి పదవీవిరమణ చేసిన అధికారులను నియమించనున్నారు. ఇందులో 60% జీతం, ఇతర భత్యాలను కేంద్ర రక్షణశాఖ భరించడం జరుగుతుంది. ఇక అటవీ శాఖ పోస్టులకు అప్లయ్ చేసుకునేవారు ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయసు 18-42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ సందర్శించాల్సి ఉంటుంది.

ఇతర సమాచారం కోసం :
వయసు : 18-42 ఏళ్లకు మించకూడదు.
విద్యార్హత : ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉండాలి.
శాలరీ : నెలకు రూ. 45,000 వరకు ఉంటుంది.
అభర్థులు పూర్తివివరాల కోసం ఈ వెబ్‌సైట్‌న్ https://psc.ap.gov.in/ సంప్రదించగలరు.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం పోస్టులు: 689
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 70
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 175
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 375
థానేదార్ : 10
టెక్నికల్ అసిస్టెంట్: 12
జూనియర్ అసిస్టెంట్: 10












Click it and Unblock the Notifications