Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీహెచ్ఎంసీ పరిధిలో 1540 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 1540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 1540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.

Green signal for 1540 Asha workers posts to fill in GHMC

హైదరాబాద్‌లో 323 పోస్టులను భర్తీ చేయనుండగా.. మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 మంది ఆశావర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా నియామక కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు.

హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు: మంచి జీతం, వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రులు/డిస్పెన్సరీలు/ డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 114
వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 59
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -01
ల్యాబ్ టెక్నీషియన్ -11
ఫార్మసిస్ట్ -43 ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమతి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక:
అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 28-03-2023.

దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+