త్వరలో గ్రూప్-4, పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: హరీశ్ రావు ప్రకటన
సిద్దిపేట: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్‌లో పోలీసు శిక్షణ పొందుతున్న 300 మంది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, పండ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాన్నారు.

పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే 17వేలకుపైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ శాఖలో మరో 2వేల పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు.
Good news to job aspirants, #Telangana govt accorded permission for filling up of 134 posts under Director of School Education, by way of Direct Recruitment through TSPSC.
— Harish Rao Thanneeru (@trsharish) November 12, 2022
Deeds, not words - that's the mantra of TRS govt under #CMKCR garu's leadership. pic.twitter.com/iZtyKIbJMD
పాఠశాఖ విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర పాఠశాఖ విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్-1 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ల పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్‌సీ వెబ్ సైట్ లో ఉంచారు.












Click it and Unblock the Notifications