తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చునని తెలిపింది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)ని హైకోర్టు ఆదేశించింది.

ఇటీవల వెల్లడించిన గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్‌ను సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీఆర్‌ఎల్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. మెయిన్స్ పత్రాల మ్యూల్యాంకనం సరిగా నిర్వహించలేదని, అందుకే అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.

High Court gives key orders on Telangana Group-1 recruitments

మూల్యాంకనం, నియామకాలు నిబంధనలకు నిబంధనలకు విరుద్ధమని, తిరిగి మూల్యాంకనం చేయాలన్నారు. లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనం హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు ప్రతివాదులను ఆదేశించాలని 20 మంది గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును అభ్యర్థించారు.

తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, నియామక పత్రాలు మాత్రం విచారణ పూర్తయ్యే వరకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

21 నుంచి ఎంబీఏ ఇంటర్నల్ పరీక్షలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంబీఏ ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదీ నిర్వహించాలని బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ రెండవ ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కాలేజీల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. కళాశాలల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.

మరోవైపు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పీఎస్‌వైడీ క్లినికల్ సైకాలజీ రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ సెకండ్ పార్ట్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+