నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ గుడ్ న్యూస్..
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు ఐడీబీఐ బ్యాంక్ తీపి కబురు ప్రకటించింది. తమ బ్యాంకుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
పోస్టులు..
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు..
676
విద్యార్హత..
ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయస్సు..
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంది. అంతే కాకుండా దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం..
ఆన్ లైన్
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - రూ.1050 ఫీజు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు - రూ.250 ఫీజు ఉంటుంది.
వేతనం..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాదికి రూ.6లక్షల వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు గడువు..
2025 మే 8 నుంచి.. 2025 మే 20 వరకు
ఈ పోసులకు అప్లై చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్ధులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://www.idbibank.in/ చూడొచ్చు. ఉత్తమ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications