IIIT Admissions 2025:ఇదే లాస్ట్ డేట్ - విద్యార్థులకు చివరి అవకాశం!
IIIT Admissions 2025:రాష్ట్రంలోని ప్రముఖ ట్రిపుల్ ఐటీ (RGUKT) క్యాంపస్‌లలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్! ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
మే 20తో ముగియనున్న గడువు
ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి మే 20, 2025 చివరి తేదీ. అర్హత కలిగిన విద్యార్థులు ఈ గడువులోగా ఆర్టీయూకేటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 32 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 45 వేల వరకు రావొచ్చని అంచనా.

ఉచిత విద్య.. ఫీజు రీయింబర్స్‌మెంట్
ట్రిపుల్ ఐటీలో ఒక్కసారి సీటు సాధిస్తే, ఆరేళ్ల పాటు ఇంజినీరింగ్ విద్య దాదాపు ఉచితంగా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అర్హత గల విద్యార్థులకు ఇది సాధ్యపడుతుంది. సీట్ల కేటాయింపు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
మొత్తం సీట్లు 4400.. కీలక తేదీలు
ఒక్కో క్యాంపస్ లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయి. ఈ ఏడాది నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో కలిపి మొత్తం 4400 సీట్లను భర్తీ చేయనున్నారు. జూన్ 5న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలవుతుంది. జూన్ 11 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ వంటి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జరుగుతుంది. ఇతర అభ్యర్థుల వెరిఫికేషన్ ఆయా క్యాంపస్‌లలో ఉంటుంది. ఒక్కసారి క్యాంపస్ కేటాయించాక బదిలీలు ఉండవు. స్కాలర్‌షిప్ రాని ఓసీ అభ్యర్థులకు నామమాత్రపు ఫీజు (పీయూసీకి రూ. 45వేలు/సం, ఇంజినీరింగ్‌కు రూ. 50వేలు/సం) ఉంటుంది. ఇతరులకు ప్రత్యేక సూపర్ న్యూమరరీ కోటా, ఫీజులు ఉన్నాయి.ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి. పీయూసీ తర్వాత ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారిచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్ కేటాయిస్తారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications