India Post GDS Result 2026: పోస్టాఫీస్ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే ?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జోన్లు, సర్కిళ్లలో ఉన్న పోస్టాఫీసుల్లో బ్రాంచ్ పోస్టు మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్లు, గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం తపాలా శాఖ (india post) తాజాగా దరఖాస్తులు స్వీకరించింది. పదో తరగతి అర్హతతో వివిధ సర్కిళ్లలో 28636 పోస్టుల్ని ఇందులో భర్తీ చేస్తున్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అయితే వీటి ఫలితాలు నిన్న వెలువడాల్సి ఉండగా ఆలస్యమైంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పదో తరగతిలో సాధించిన ఫలితాల ఆధారంగా పోస్టల్ శాఖ ఆటోమేటిగ్గా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. ఇందులో అభ్యర్ధుల రిజర్వేషన్లు, వయస్సు, ఇతర ప్రామాణికాల ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల తర్వాత అభ్యర్ధులు తమ ధృవపత్రాల్ని తీసుకెళ్లి సమర్పించాలి. మెరిట్ లిస్ట్ లో పేరు ఉండి కూడా ఉద్యోగాలకు రాని వారిని మినహాయించి ఇతరులతో భర్తీ చేస్తారు. మిగిలిన ఉద్యోగాల కోసం మళ్లీ మెరిట్ లిస్ట్ లు తయారు చేస్తారు. అలా పూర్తిగా ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకూ మెరిట్ లిస్టుల్ని తయారు చేస్తారు.

India Post GDS Result 2026 Update First Merit List for 28 636 Posts Expected TODAY or This Week

ఇందులో తొలి మెరిట్ లిస్ట్ ను నిన్నే విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించినా రాత్రి వరకూ కూడా రాలేదు. దీంతో ఇవాళ లేదా వచ్చే వారం రోజుల్లో ఈ లిస్ట్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందని తపాలా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఒకసారి మెరిట్ లిస్ట్ విడుదల కాగానే అభ్యర్ధులు నేరుగా https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ లోకి వెళ్తే అక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్లి తమ రాష్ట్రం, జోన్ ఎంచుకుంటే పీడీఎఫ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే పైన సెర్చ్ లోకి వెళ్తారు. అక్కడ అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తే మెరిట్ లిస్ట్ లో ఉన్న వారికి తమ ఫలితం చూపిస్తుంది. లేకపోతే ఎలాంటి ఫలితం చూపించదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+