AI ఎంట్రీతో ఉద్యోగాల్లో భారీ కోతలు- కాపాడుకోవాలంటే చేయాల్సిందిదే?
కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఆత్మరక్షణలోకి వెళ్లిపోయాయి. లాభాల్ని పెంచుకుంటూ నష్టాల్ని, ఖర్చుల్ని తగ్గించుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు రకరకాల వ్యూహాల్ని ఆశ్రయిస్తున్నాయి. ఇందులో ఉద్యోగాల కోతలు ముఖ్యమైనవి. వీటి కోసం తాజాగా ఎంట్రీ ఇచ్చిన కృత్రిమ మేథ(ఏఐ) సాయం తీసుకుంటున్నాయి. వీలైనన్ని విభాగాల్లో ఏఐని వాడుకోవడం ద్వారా ఉద్యోగులకు లేఆఫ్ లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో భయాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి లేదా సుస్ధిరం చేసుకోవడానికి ఉద్యోగులు ఏం చేయాలి ? అలాగే విద్యాసంస్ధలు ఏం చేయాలన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి సమాధానంగా పలువురు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఏఐ ఎంట్రీ తర్వాత గాల్లో దీపాలుగా మారిన ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి మెజార్టీ నిపుణులు సూచిస్తున్న మార్గం మార్పుకు అనుగుణంగా తామూ మారిపోవడమే. అలా చేస్తే తప్ప ఉద్యోగాల్ని కాపాడుకోవడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తున్నారు.

ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పటివరకూ ఉద్యోగాల కోసం తాము నేర్చుకున్న నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, లేదా పూర్తిగా కొత్త నైపుణ్యాల వైపు మళ్లడమే ప్రస్తుత ఏఐ సమస్యకు మందు అని నిపుణులు చెప్తున్నారు. చాలా కంపెనీలు నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే చాలా వరకూ ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా తాము చేస్తున్న ఉద్యోగాలకు పనికొచ్చే ఏఐ ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యాసంస్ధలు కూడా ఏఐ ఆధారిత కోర్సుల్ని ఆఫర్ చేయాలని వారు సూచిస్తున్నారు.
ఇప్పటికే పలు కళాశాలలు, యూనివర్శిటీలు ఏఐ ఆధారిత కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాయి. వీటిలో తమ ఉద్యోగాలకు పనికొచ్చే కోర్సుల్ని చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేదా కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడం ద్వారా కొత్త సంస్ధల్ని, కొత్త ఉద్యోగాల్ని వెతుక్కుంటే మంచిదని సూచిస్తున్నారు. స్దూలంగా చెప్పాలంటే మార్పుకు తగినట్లుగా మనమూ మారిపోవాల్సిందేనంటున్నాయి. ప్రభుత్వాలు కూడా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ విద్యా వ్యవస్ధల్లో మార్పులు చేయడం, అధ్యాపకుల్ని కూడా ఆ దిశగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications