JEE Main 2026 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!
గత నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 (JEE Main 2026 Result) ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేసింది. గత నెలలో జరిగిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షల్లో ఇవాళ కేవలం పేపర్ 1 ఫలితాలు మాత్రమే విడుదల చేశారు. పేపర్ 2 ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇవాళ విడుదల చేసిన పేపర్ 1 ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటుకున్నారు. మొత్తం ముగ్గురు 100 పర్సంటైల్ సాధించారు.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో బీఈ/బీటెక్ అడ్మిషన్ల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలను ఈ జనవరి 21,22,23, 24,28 తేదీల్లో నిర్వహించింది. ఇందులో ఉత్తీర్ణులైన వారి కోసం ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. అలాగే విద్యార్ధులు తమ స్కోర్ కార్డుల్ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో కూడా వెల్లడించింది. అభ్యర్ధులు వీటిని పాటించాల్సి ఉంటుంది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి సెషన్ జెఈఈ మెయిన్స్ 2026 పరీక్షల తుది ఆన్సర్ కీని ఇవాళ ఉదయం వెల్లడించింది. అలాగే సెషన్ వన్ టాపర్‌లను ప్రకటించింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాలను తెలుసుకోవాలంటే ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్
https://jeemain.nta.nic.in/ లోకి వెళ్లాలి. అక్కడ అభ్యర్థులు వారి అప్లికేషన్ నంబర్, లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉపయోగించి స్కోర్ కార్డుల్ని ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటిని ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షల్లో ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ , తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహేశ్వరి 100 పర్సంటైల్ సాధించారు.
ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 9 వరకూ జేేేేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఉంటాయి. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో సంతృప్తి లేకపోతే విద్యార్దులు రెండో సెషన్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పరీక్షల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటి ఆధారంగా ర్యాంకుల కేటాయింపు ఉంటుంది. అనంతరం వీరిలో నుంచి 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సెడ్ పరీీక్షలు రాసే అవకాశం లభిస్తుంది. వాటిలో వచ్చే ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications