JEE Mains Result 2024: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాల విడుదల- స్కోర్ కార్డ్ చెక్ ఇలా ..!

ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షా ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు ఎన్టీఏ వెబ్ సైట్ jeemain.nta.ac.in లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 4,5,6,8,9 తేదీల్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 319 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 12న కీని విడుదల చేశారు. ఏప్రిల్ 14 వరకూ ఆభ్యంతరాలు స్వీకరించి 21న ఫైనల్ కీ ఇచ్చారు. ఇప్పుడు తుది ఫలితాలు ప్రకటించారు.

JEE Mains session 2 Result 2024 declared- here is how to check score card cutoffs toppers list

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్ష కోసం మొత్తం 11.79 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 10.67 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో అన్ రిజర్వుడ్ కేటగిరీకి (UR) 93.2362181గా నిర్ణయించారు. UR-PwD కేటగిరీకి 0.0018700, EWS కేటగిరీలో 81.3266412, ఓబీసీ కేటగిరీలో 79.6757881, ఎస్సీకి 60.0923182, ఎస్టీకి 46.6975840 కటాఫ్ గా నిర్ణయించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి సంబంధించిన క్వాలిఫైయింగ్ పర్సంటైల్ కేటగిరీల్లో ఐదేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ కనీస కటాఫ్ 93.2, 2023లో 90.7, 2022లో 88.4. జనరల్-ఈడబ్ల్యూఎస్‌కి ఈ సంవత్సరం కటాఫ్ 81.3, గత సంవత్సరం 75.6, 2022లో 63.1గా ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన అర్హత శాతం 2022లో 68 నుండి 79.6కి , అలాగే 2023లో 73.6కి పెరిగింది. 2023లో 51.9 నుండి SCల శాతం 60కి చేరుకోవడంతో, ఎస్సీ, ఎస్టీ వర్గాల అర్హత స్కోర్‌లో భారీ పెరుగుదల నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+