ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు-ఎన్సీఈఆర్టీ సిలబస్-ఒక్క మార్కు ప్రశ్నలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2025-26 నుంచి ఈ మార్పుల్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఈ మేరకు కాలేజీలకు సమాచారం కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిలబస్ తో పాటు పరీక్షల విధానంలోనూ పెను మార్పులు చేస్తోంది. దీంతో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్ధులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అందుబాటులోకి రానుంది. అలాగే పరీక్షల్లో ఒక్క మార్కు ప్రశ్నలు రాబోతున్నాయి.

ఇంటర్ లో మ్యాథ్స్ పేపర్ ఇప్పటివరకూ 75 మార్కుల చొప్పన ఏ,బీగా 150 మార్కులకు ఉండగా దీన్ని కలిపేసి 100 మార్కుల పేపర్ గా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పటివరకూ 60 మార్కుల చొప్పున ఉండగా... వీటిని 85 మార్కులకు పెంచారు. ఫస్టియర్ లో 15, సెకండియర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కు కేటాయించారు. బైపీసీ విద్యార్ధులకు బోటనీ, జువాలజీ కలిపి బయోలజీపేపర్ గా మారబోతోంది. ఇందులో బోటనీ 43 మార్కులు, జువాలజీ 42 మార్కులు కలిపి మొత్తం 85 మార్కులకు పేపర్ ఇస్తారు. సీఈసీ విద్యార్ధులకు కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల పేపర్ ఉంటుంది.

key changes in ap intermediate education NCERT syllabus for first year one mark questions

సైన్స్ గ్రూపులకు ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ కామర్స్ లో అకౌంటెన్సీ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల పేపర్లలోనూ నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఇక అన్ని పేపర్లలోనూ ఒక మార్కు ప్రశ్నలు రాబోతున్నాయి. వీటిలో మ్యాథ్స్ లో సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 9 చొప్పున ఇస్తారు. 2 మార్కుల ప్రశ్నలు మ్యాథ్స్ లో 10 ఛాయిస్ లేకుండా ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో రెండు మార్కుల ప్రశ్నలు 14 చొప్పున ఇస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు పేపర్లలోనూ 4, 8 మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది.

Take a Poll

బయోలజీలో బోటనీలో 5, జువాలజీలో 4 ఒక్క మార్కు ప్రశ్నలు ఇస్తారు. రెండు మార్కుల ప్రశ్నలు ఇరు విభాగాల్లోనూ కలిపి 14 ఉంటాయి. మిగతా ప్రశ్నలు 4, 8 మార్కులవి ఉంటాయి. ఆర్ట్స్ లో పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ లో పదేసి ఒక్క మార్కు ప్రశ్నలు ఇస్తారు. రెండు మార్కుల ప్రశ్నలు 15, హిస్టరీలో నాలుగు మార్కులకు మ్యాప్ ఇస్తారు. కామర్స్, అకౌంటెన్సీ కలిపి 8 ఒక్క మార్కు ప్రశ్నలుంటాయి. ఇంగ్లీష్ లో ఒక్క మార్కు ప్రశ్నలు 34, అర్ధమార్కు ప్రశ్నలు 32 ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+