Nursing: నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! ఇకపై ఇలా..!

ఏపీలో బీఎస్సీ నర్సింగ్ (BSC Nursing) కోర్సులో ప్రవేశాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నర్సింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో కారణాలను అన్వేషించిన ప్రభుత్వం.. గతంలో ఉన్న విధానంలో కీలక మార్పు చేసింది. దీంతో ఇకపై నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్ధులు తప్పనిసరిగా నీట్ పరీక్ష రాయాల్సిందే. ఈ మేరకు వైద్యశాఖ నుంచి అందిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

నీట్ పరీక్షతోనే నర్సింగ్ అడ్మిషన్లు (nursing admissions)

రాష్ట్రంలో నాలుగేళ్ల బియ‌స్సీ (న‌ర్సింగ్‌) కోర్సుల్లో నీట్-యుజీ ప‌రీక్ష ఆధారంగా ప్ర‌వేశాల‌ను చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వైద్యారోగ్య శాఖ పంపిన ప్ర‌తిపాద‌న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీంతో 2026-27 విద్యా సంవ‌త్స‌రంలో న‌ర్సింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌ను ఆశించే విద్యార్థులు నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్‌)-యుజీ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది.

Major Change in AP Nursing Admissions to Be Through NEET Starting Next Education Year

గతంలో ఏం జరిగింది ?

గతంలో నర్సింగ్ కోర్సుల అడ్మిషన్లు ఎంసెట్ పరీక్ష ఆధారంగానే జరిగేవి. కానీ గత ఏడాది న‌ర్సింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌ను మొద‌టి సారిగా ఏపీ ఎన్‌సెట్ ( APNCET-Andhra Pradesh Nursing Common Entrance Test) ఆధారంగా చేప‌ట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ప్ర‌యోగం చేయడం, కేవ‌లం విజ‌య‌వాడ‌లో మాత్ర‌మే ప‌రీక్ష నిర్వ‌హించ‌డంతో ఆశించిన స్థాయిలో విద్యార్థులు స్పందించ‌లేదు. దీంతో 16,000 బియ‌స్సీ (న‌ర్సింగ్‌) సీట్ల‌లో దాదాపు 4,000 సీట్లు భ‌ర్తీ కాలేదు. గతంలో ఇంటర్ మార్కులు, ఎంసెంట్ ప‌రీక్ష ఆధారంగాను ప్ర‌వేశాలు జ‌రిగేవి. ఈ మార్పు ప్రభావం అడ్మిషన్లపై పడింది.

Major Change in AP Nursing Admissions to Be Through NEET Starting Next Education Year

ఏపీ ప్రభుత్వ నిర్ణయం వెనుక

దీంతో వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్న‌తాధికారుల‌తో న‌ర్సింగ్ ప్ర‌వేశాల‌కు ఉత్త‌మ‌మైన విధానంపై స‌మీక్షించారు. రాష్ట్ర స్థాయి ప‌రీక్ష‌ల ప‌ట్ల ఇత‌ర రాష్ట్రాల విద్యార్థులు ఆస‌క్తి చూప‌డంలేద‌ని, నీట్ ప‌రీక్ష దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ‌ పొందింద‌ని, వివిధ ప‌రీక్ష‌ల ద్వారా ప్ర‌వేశాలు భిన్న స‌మ‌యాల్లో నిర్వ‌హించ‌డంవ‌ల్ల విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని, ప్ర‌వేశాల‌కు నీట్ ప‌రీక్ష స‌రైన మార్గ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. నీట్ ప‌రీక్ష నిర్దిష్ట స‌మ‌యంలో నిర్వ‌హించ‌బ‌డ‌డం వ‌ల్ల న‌ర్సింగ్ ప్ర‌వేశాల్లో జ‌రుగుతున్న ఆల‌స్యాన్ని తొల‌గించ‌వ‌చ్చ‌ని వారు తెలిపారు. ప్రైవేట్ న‌ర్సింగ్ క‌ళాశాల‌లు కూడా నీట్ ఆధారిత ప్ర‌వేశాల‌ను స‌మ‌ర్ధించాయి. దీంతో సీఎంకు ప్రతిపాదన పంపడంతో ఆయన ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+