రేపు దర్శిలో మెగా జాబ్ మేళా..! ఎల్ అండ్ టీ, అమర్ రాజా సహా టాప్ ఆఫర్స్..!
ఏపీలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకునే క్రమంలో కూటమి సర్కార్ వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో జాబ్ మేళాలు నిర్వహించింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా దర్శిలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.
ప్రకాశం జిల్లా దర్శిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) సౌజన్యంతో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దర్శి పట్టణంలో అద్దంకి రోడ్డులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాలో అమర్ రాజా గ్రూప్,జాయ్ అలూక్కాస్,
ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్స్, హెటిరో ల్యాబ్స్, శంకర్ కియా, టీవీఎస్ ఇండియాన్, పయనీర్ మహేంద్ర, ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్, ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్ వంటి సంస్థలు పాల్గొంటున్నాయి.

ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు 10వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ వంటి అర్ఙతలు నిర్దేశించారు. పురుషులు, మహిళలూ ఇద్దరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు మాత్రం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులకూ అవకాశం కల్పిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన వారు సంప్రదించ వలసిన వారు- ఎం.గోపీ కృష్ణ-8897964505. అభ్యర్థులు మరిన్ని వివరాలకు APSSDC కమాండ్ కంట్రోల్ నంబర్లు 9988853335, 8712655686, 8790118349, 8790117279 ను కూడా సంప్రదించవచ్చు. అలాగే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం https://naipunyam.ap.gov.in ను సందర్శించవచ్చు. ప్రకాశం జిల్లా యువత , దర్శి నియోజకవర్గం లోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications