NEET UG 2025 syllabus: నీట్ పరీక్ష సిలబస్ విడుదల-డౌన్ లోడ్ ఇలా..!
జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష 2025 సిలబస్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ విడుదల చేసింది. నీట్ అధికారిక వెబ్ సైట్ లోనే ఈ సిలబస్ ను విడుదల చేశారు. అలాగే వచ్చే ఏడాది పరీక్షకు కచ్చితంగా ఈ సిలబస్ మాత్రమే ప్రిపేర్ కావాలని ఎన్టీఏ అభ్యర్ధులకు సూచించింది. అదే సమయంలో సిలబస్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, ఇతర వివరాలను కూడా వెల్లడించింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2025) పరీక్ష కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ సిలబస్ విడుదల చేసింది. దీన్ని నీట్ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరారు చేసిన ఈ సిలబస్ నే అభ్యర్ధులు తప్పనిసరిగా అనుసరించాలని ఎన్టీఏ ఇవాళ సూచించింది. సిలబస్ ను వెబ్ సైట్ లో పీడీఎఫ్ ల రూపంలో ఉంచారు.

ఇవాళ విడుదల చేసిన నీట్ సిలబస్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in ను అడ్రస్ బార్ లో ఎంటర్ చేయాలి. అనంతరం మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పబ్లిక్ నోటీస్ అనే విభాగం కనిపిస్తుంది. ఇందులో సిలబస్ ఫర్ నీట్ యూజీ 2025 పేరుతో ఓ హైపర్ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పీడీఎఫ్ సిలబస్ లింక్ కనిపిస్తుంది. అభ్యర్ధులు దీన్ని క్లిక్ చేస్తే సిలబస్ డౌన్ లోడ్ అవుతుంది. అనంతరం దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఏవైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే వెబ్ సైట్ లోనే అధికారుల్ని సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications