ఏపీ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు షాక్..! 16 వేల మందిపై ఎఫెక్ట్..!

ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు ( AP IIIT) ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో విద్యార్ధులకు భారీ షాక్. నాలుగేళ్లుగా ఇక్కడ చదువుతున్న విద్యార్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. దీంతో వారికి అందాల్సిన ఒరిజినల్ డిగ్రీలు మాత్రం అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. నానాటికీ ఆలస్యం చేస్తూనే ఉంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో 2022 నుంచి బీటెక్ కోర్సు పూర్తి చేసి బయటికి వచ్చిన విద్యార్ధులకు ఇప్పటివరకూ ఒరిజినల్ డిగ్రీ పట్టాలు అందించలేదు. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి మొత్తం 24 వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఇందులో ప్రతీ ఏటా ఒక్కో ట్రిపుల్ ఐటీ నుంచి వెయ్యి మంది విద్యార్ధుల చొప్పున డిగ్రీలు పూర్తి చేసుకుని బయటికి వస్తుంటారు. కానీ వీరికి డిగ్రీ ఒరిజినల్ పట్టాలు మాత్రం అందడం లేదు.

No Convocations 16 000 AP IIIT Students Original Certificate-Less for Four Years

దీని వెనుక ఉన్న ప్రధాన కారణం స్నాతకోత్సవాలు నిర్వహించకపోవడమే. అయితే స్నాతకోత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని అడిగితే అధికారులు చాలా కారణాలు చెప్తున్నారు. ఇందులో రెగ్యులర్ వీసీ లేకపోవడం ఓ ప్రధాన కారణం. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల నిర్వహణ రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానిదే. ఈ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల స్నాతకోత్సవాలు జరగడం లేదు. ఇవి జరగకపోవడంతో కోర్సు పూర్తి చేసి బయటికి వస్తున్న విద్యార్ధులకు ఒరిజినల్ పట్టాలు అందించలేని పరిస్ధితి ఎదురవుతోంది.

No Convocations 16 000 AP IIIT Students Original Certificate-Less for Four Years

ఇలా నాలుగేళ్లలో నాలుగు ట్రిపుల్ ఐటీల నుంచి బయటికి వచ్చిన 16 వేల మంది విద్యార్ధులు ఇప్పటికీ పట్టాల కోసం ఎదురుచూడాల్సిన దుస్దితి ఎదురవుతోంది. చివరిసారిగా ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్ధులకు 2022లో అప్పటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పట్టాలు అందించారు. 2021 సంవత్సరానికి కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు 2022లో ఇచ్చిన పట్టాలే చివరివి. ఆ తర్వాత ఇప్పటికీ పట్టాలు ఇవ్వట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+