కస్తూర్బాగాంధీ స్కూల్స్‌లో 1241 పోస్టులు: 17న నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్ఎస్‌లలో మొత్తం 1241 ఉద్యోగాలు కాట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

854 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ, 12 ఎస్ఓ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. జూన్ 26 నుంచి జులై 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారు. https://schooledu.telangana.gov.in/ISMS/లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు.

 Notification for filling key posts in kgbv and urs tomorrow

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునర్ పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021, మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 18 జారీ చేసిందని.. నిబంధనల మేరకు ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు లేవని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, రమావత్ ధన్‌సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకం పరిశీలించాలని ఆదేశించింది. ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు పరిశీలించాలని.. 3 నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని హైకోర్టు పేర్కొంది.

లీకేజీ కేసులో మరో నిందితుడి కస్టడీ

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు మహమ్మద్ ఖాలిద్ అనే నిందితుడిని ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 51కి చేరుకుంది. మహమ్మద్ ఖాలిద్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. 3 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సిట్ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి ఖాలిద్‌ను కస్టడీకి తీసుకున్నారు. మరో నిందితుడు పూల రమేష్‌కు ఖాలిద్ హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు సిట్ తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+