CYBER SECURITY COURSES: తెలంగాణలోని ఉద్యోగార్థులూ దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ.. భారత ప్రభుత్వ సర్టిఫైడ్ ఆన్‌లైన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సులలో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది, ఆసక్తి ఉన్న ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, పిజి అభ్యర్థులు సంబంధిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అందించే కోర్సులు:
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా & పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ.
స్వర్ణ భారత్ నేషనల్ లెవల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద SC, ST, BC, EBC, OBC, మైనారిటీ, PH, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికోద్యోగులు, వారి పిల్లలకు కోర్సు ఫీజులో 50% వరకు ఫీజు రాయితీని NACS అందిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత, భారత ప్రభుత్వ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

సైబర్ సెక్యూరిటీలో కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్, సిస్టమ్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్లు, సెక్యూరిటీ అనలిస్ట్‌లు, చొరబాటు గుర్తింపు నిపుణులు, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాండర్లు, క్రిప్టాలజిస్ట్‌లు, వల్నరబిలిటీ అసెస్సర్‌లు, విద్యా సంస్థలలో శిక్షకుడు / ఉపాధ్యాయులు వంటి జాబ్ ప్రొఫైల్‌లలో అవకాశాలను పొందుతారు.
ఈ అభ్యర్థులకు భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఈ వెబ్‌సైట్: www.nacsindia.org ను సంప్రదించండి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31/03/2022
వివరాలకు ఫోన్ నంబర్: 7893141797ను సంప్రదించండి
విమలా రెడ్డి, డైరెక్టర్.












Click it and Unblock the Notifications