PGCILలో ఉద్యోగాలు: డిప్లొమా ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేయండి..మంచి జీతం: అర్హతలు ఇవే.!!
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న వారికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డిప్లొమా ట్రైనీ మరియు జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనుంది.
ఇక పోస్టులను విభాగాల వారీగా చూస్తే డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్)23 ఖాళీలను భర్తీ చేయనుండగా.. డిప్లొమా ట్రైనీ (సివిల్)లో 63 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.విద్యార్హతల విషయానికొస్తే డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్)కు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా. 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇక డిప్లొమా ట్రైనీ సివిల్‌కు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.

అర్హులైన అభ్యర్థుల వయస్సు 12జూలై 2021 నాటికల్లా 27 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజును కూడా నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. డిప్లొమా ట్రైనీకి అప్లయ్ చేసే అభ్యర్థులు రూ. 300/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
ఇక పవర్‌గ్రిడ్ ఆఫ్ ఇండియా భర్తీ చేసే ఈ 86 పోస్టులన్నీ పర్మినెంట్ పోస్టులు.డిప్లొమా ట్రైనీగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25000 నుంచి రూ.1,17,500 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 18 సెప్టెంబర్ 2021. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.powergrid.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.












Click it and Unblock the Notifications