తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచే? నేడు ప్రకటించే ఛాన్స్..!

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో షెడ్యూల్ పై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధికారిక ప్రకటన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలు ఖరారు చేయబోతున్నారు.

తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇవాళ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన సమీక్షలో విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని పదో తరగతి పరీక్షల తేదీలపై చర్చించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపు పదో తరగతి పరీక్షలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ లెక్కన మార్చి రెండో వారంలో పరీక్షల నిర్వహణ చేపట్టనున్నారు.

telangana 10th class exams to be held from march 18, 2024- government to release schedule today

మార్చి 18వ తేదీన తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభించి మూడో వారంలో వీటిని పూర్తి చేయాలని అధికారులు సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఇవాళ జరిగే విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచి ఆమోదం తీసుకోనున్నారు. అనంతరం పూర్తి షెడ్యూల్ విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే మార్చి 18న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో లీకులు, ఇతర అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్షలోనూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇవాళ జరిగే భేటీలోనూ దీనిపై ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేస్తారని తెలుస్తోంది. వీటి తర్వాత పదో తరగతి షెడ్యూల్ ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+