నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! 14వేల ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. 6399 అంగన్వాడీ, 7837 హెల్పర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ ద్వారా ఒకేసారి 14,236 ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

Telangana government gives green signal to fill 14 236 jobs

మహిళ శిశు సంక్షేమ శాఖలో ఏకకాలంలో 14వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేపట్టడం ఇదే తొలిసారని మంత్రి సీతక్క తెలిపారు. తాజా పోస్టుల భర్తీతో అంగన్వాడీలు మరింత పటిష్ఠం కానున్నాయన్నారు.

ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథం

ఆదివారం (ఫిబ్రవరి 23) జరగాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అభ్యర్థులు 15 నిముషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థుల కోసం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు వందమీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. గ్రూప్‌-2 పరీక్షపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఏపీపీఎస్సీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+