కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్‌న్యూస్: వారినే కొనసాగించాలని తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 527 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను 2023-24 విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు నెలల క్రితం 270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో మిగిలిపోయిన వారిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు, ఆగస్టు 31వ తేదీలోపు వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని వాకాటి కరుణ సూచించారు.

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల కూడా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని కూడా నియమించుకోవాలని కళాశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
గెస్ట్ లెక్చరర్లపై హైకోర్టు ఆదేశాలు : రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని తెలంంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యా సంవత్సరాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది. జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియమానికి జులై 18న ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో గెస్ట్ లెక్చరర్లు పిటిషన్ దాఖలు చేశారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదులు లేని, అర్హులైన గెస్ట్ ఫ్యాకల్టీని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇంటర్ కమిషనరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది హైకోర్టు. కాగా, జులై 18న తెలంగాణ ఇంటర్ బోర్డు 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 19వ తేదీ నుంచి జులై 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే, గెస్ట్ లెక్చరర్ల నోటిఫికేషన్‌పై గతంలో పనిచేసిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి కొత్తగా ఇంటర్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదంటూ వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ కావాలనే తమను తొలగించారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications